గుండక్రియ
౩.వఱతఁ బోయెడి వాని వడిఁ దీయవలె గాక
దరివానిఁ దినియంగఁ దానేలా
వరద నీటిలో కొట్టుకొని పోతున్న మనిషిని తొందరగా(ప్రాణాలతో)బయటికి తీసి రక్షించాలి కాని గట్టుమీద నున్నవానిని రక్షించటానికి తన అవసరం లేదు.
అనయము దుర్బలుని కన్నమిడవలెఁ గాక
తనిసిన వానికిఁ దానేలాఎప్పుడూ బలహీనంగా వుండే వానికి అన్నం పెట్టాలి కాని దుక్కలా వున్నవానికి తన అన్నంతో పనిలేదు.
ధృతిహీనుఁ గృపజూచి తిరువేంటేశ్వరుఁడు
తతిఁ గావకుండినఁ దానేలా 1-18
ధైర్యము కోలుపోయిన వానిని శ్రీ వేంకటేశ్వరుడు తన కృపతో తప్పక కాపాడాలి.అలా కానిచో తన దైవత్వం నిరుపయోగం.
ముఖారి
౪.అనుమానపు బ్రతుకది రోఁతా తన-
మనసెనయని కూటమి మరి రోఁతా 1-26
ప్రతిక్షణం అనుమానంతో బ్రతకడం ఎంతో రోత కలిగించే విషయం.మనసులు కలియని కూడిక ఇంకెంతో రోత కలిగిస్తుంది.
Saturday, May 31, 2008
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
నరసింహ గారూ.. మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నా. ఎంత బావుందో..?!! మీ అనుమానాలను ఎవరూ నివృత్తి చేస్తున్నట్టు లేదు. ఆ చర్చలు జరిగితే, నిజంగా ఇంకా చాలా బావుండేది ఈ 'అన్నమయ్య పలుకుబడులు'.
Post a Comment