Friday, September 13, 2013

యేడ నుండి పుట్టితిమో యింతక తొల్లి యింక-

35.
యేడ నుండి పుట్టితిమో యింతక తొల్లి యింక
నేడకుఁబోయెదమో యిట మీఁదను

గత చన్న పితరు లక్కట నెవ్వరో
హితవై యిప్పటి పుత్రులిది యెవ్వరో

తొడికి స్వర్గాదులు తొల్లి యాడ వోయీ-
నడచే ప్రపంచము నా కేడదో.     4-393


తొడికిలు = ఒడిసి పట్టుకొను, లంకించుకొను

Thursday, September 12, 2013

ఇదియే వేదాంత మిందుకంటే లేదు


33.
ఇదియే వేదాంత మిందుకంటె లేదు
యిదియే శ్రీవేంకటేశుని మతము

విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియే పో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వినకవారెల్ల
విరతిఁ బొందకున్నవీడదు భవము   IIఇదియేII

చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తమువలెనే శ్రీహరి నిలుచును
చిత్తశాంతి లేక చేరదు పరము           IIఇదియేII

యెంతచదివినా యెంతవెదకినా
యింతకంటె మరి యిఁక లేదు
యింతకంటె శ్రీవెంకటేశుదాసులౌట
యెంతవారికైన యిదియే తెరువు.    IIఇదియేII       4-369

విరతి = విరామము ,విశ్రాంతి
తెరువు = దారి, మార్గము

Sunday, September 8, 2013

దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ

32.
దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ
యీవల సంసారికి నేమి సేయవచ్చును

ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు
వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు
వేసట యెక్కడ నుండు వీత రాగ మాడనుండు
యీసుల నీ లంకె వాప నెవ్వరికిఁ దరము IIదైవమేII

అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు
మతిఁ బంత మెందుండు మత్సర మందుండు
మతకము లేడనుండు మాయలును నందు నుండు
యితరు లెవ్వరు నిందు కే మనగలరు IIదైవమేII

తన భక్తి యెందుండు తపమును నందుండు
మనసెందు నుండు దీమసమును నందుండు
తనివి యెక్కడనుండు తగు సుఖ మందుండు
తనర శ్రీ వేంకటేశు దైవికము లివియే.  IIదైవమేII  4-351

నీవే కాచుట గాక నేరుపు నా యందేది

నీవే కాచుట గాక నేరుపు నా యందేది
చేవల వేఁప మాను చేఁదు మానీనా. 4-345

నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్   -- అంటూ వేడుకోవటమే మనం చేయాల్సిన పని-- అని బోధిస్తున్నారు మనకు అన్నమయ్య.

Sunday, July 18, 2010

ముఖరమై మాఁకులకు మొదలఁ బోసిన నీరు శిఖలకుఁ దనువెక్కి చిగిరించిన యట్టు

29.
ముఖరమై మాఁకులకు మొదలఁ బోసిన నీరు
శిఖలకుఁ దనువెక్కి చిగిరించిన యట్టు
వరుసల నిన్నిటా వన్నె బంగారమే
పరిపరి విధముల పలు సొమ్ములైనట్లు 4-340

30.
ఎంత వెఱ్ఱిఁ గొండదవ్వి యెలుకఁ బట్టెద నేను
పంతపు శ్రీహరి నా భ్రమ వాపవే
పడని పాట్లఁ బెక్కు పనులఁ దిరుగుటెల్ల
కుడిచే పట్టెఁడు గూటి కొర కింతే కా
కడ దాఁకాఁ జెలులతోఁ కాపురము సేయుటెల్ల
వొడలు మరచి యుండే వొక్క నిమిషానికా. 4-344

Monday, April 12, 2010

కోటి విద్యలునుఁ గూటి కొఱకె పో

28.
కోటి విద్యలునుఁ గూటి కొఱకె పో
చాటువ మెలఁగేటి శరీరికి
తేటల నాఁకలి దీరిన పిమ్మట
పాటుకుఁ బాటే బయలై పోవు

మెఱసేటి దెల్లా మెలుఁతల కొరకే
చెఱల దేహముల జీవునికి
అఱమరపుల సుఖమందిన పిమ్మట
మొఱఁగుకు మొఱఁగే మొయిలై పోవు

అన్ని చదువులును నాతని కొరకే
నన్నెరిఁగిన సుజ్ఞానికిని. 4- 339

Monday, March 15, 2010

శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని

27.
శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని
తనకది హీనమని తలఁచుకోదు
మనసొడఁబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు.

పురువుకుండేనెలవు భువనేశ్వరమై తోఁచు
పెరచోటి గుంతయైన ప్రియమై యుండు
యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు  " సర్వం విష్ణుమయ " ము     4-264

బ్లాగ్మిత్రులందరికీ నూతన తెలుగు సంవత్సర ( వికృతి నామ ) శుభాకాంక్షలు

Saturday, March 6, 2010

పెంచగ పెంచగఁ బెరిగీ నాసలు తుంచఁగఁదుంచఁగ దొలఁగునవి

25.
నీట ముంచు పాలముంచు నీ చిత్తమికను.   4-224
ఓ  స్వామీ ! నీట ముంచినా పాలముంచినా నీదేనయ్యా భారము. సర్వస్య శరణాగతి.
26.
పెంచగ పెంచగఁ బెరిగీ నాసలు
తుంచఁగఁ దుంచఁగ దొలఁగునవి
కంచము కూడును కట్టిన కోకయు
వంచన మేనికి వలసిన దింతే
గుడిశ లోన నొక కుక్కిమంచమున
వొడలు సగము ననువుండెడి దింతే. 4-242

మనం పెంచుకొనే కొలదీ ఆశలు పెఱిగిపోతుంటాయి. మనం వాటిని తుంచుకోవటం చేతనే వాటిని అదుపులో ఉంచుకోగలుగుతాం. తుంచగా తుంచగా అవి తొలగుతవి,  కాని ఒకేమాఱు అన్ని ఆశలూ పోవు.
మన శరీర పోషణకి కావలసినవి - కుడవటానికి పట్టెడు మెతుకులూ, కట్టడానికింత గుడ్డానూ. ఉండటానికో గుడిశ, పరుండటానికో కుక్కిమంచమూ కూడా వుంటే  ఇంక కావలసినదేముంది ?

Thursday, January 21, 2010

విత్తొకటి వెట్టఁ గాను వేరొకటి మొలచీనా

24.
విత్తొకటి వెట్టఁగాను వేరొకటి మొలచీనా
హత్తి దేహగుణములు ఆతుమ కయ్యీనా
చెంది చేదుతిన్న నోరు చేఁదే యయివుండుఁ గాక
దిందు పడి కొంతైనాఁ దియ్యనుండీనా
యెంగిలి బుట్టిన మేను హేయమే వెదకుఁ గాక
చెంగలించి పావనము సేసుకొనీనా
చేతికి వచ్చిన సొమ్ము చేరి దాఁచు కొనుఁ గాక
యేతులఁ దా నొల్లనంటా యీసడించీనా
4-186

దిందు పడి
యేతుల
పై పదాల కర్థాలు తెలియలేదు.

Monday, December 21, 2009

మనసులోని హరి మరవక తలచిన

23.
మనసులోని హరి మరవక తలచిన
యెనయ నిహపరము లే మరుదు
పెనగొన నాతనిపేరు నుడిగినను
తనకు మహానందము లే మరుదు


పుట్టించినాతని పొసగఁగ గొలిచిన 
యిట్టె వివేకం బే మరుదు
చుట్టి యతని దాసులకు మొక్కినను
పుట్టును గెలుచుట భువి నే మరుదు . 4-174

Saturday, December 19, 2009

మఱి విచారించఁ బోతే మంచము కిందే నూయి

22.
మఱి విచారించఁ బోతే మంచము కిందే నూయి
ఱాలు దింటా మలిగండ్లేఱఁగనేల--------
కుమ్మరావమునఁ జెంబు కోరి వెదకనేల
లోఁగుచుఁ బిండికూరలోన నలుపెంచనేల  4-135

Friday, December 18, 2009

పురుష జంతువులెల్ల పొంచి యాఁడు జంతువుల తరవాయి గొని వెంటఁ దగులుఁ గాని

21.
పురుష జంతువులెల్ల పొంచి యాఁడు జంతువుల
తరవాయి గొని వెంటఁ దగులుఁ గాని
ధర నాఁడు జంతువులు తగ పురుష జంతువుల
యిరవు వెదకఁ బోవు యిది యెట్టి మాయో 


సారెకు నర్థమునకు జనులెల్ల దాసులై
కోరి వెదకుచు దిరుగుదురు గాని
చేరువ యర్థములెల్ల జీవులకు దాసులై
యీరీతి వెదకవు యిది యెట్టి మాయో


లోకము నడవడిది లోనుగాక యిందుకెల్లా
యేకచిత్తమున నుంటే యెక్కుడు గాని
దాకొని శ్రీవేంకటేశు దాసుఁ డైన వానికిని
యేకముగఁ బంపుసేసు నేమి మాయో కాని . 4-134

Thursday, December 17, 2009

పెదవులచేటింతే పేదవాని కోపము

17.
పులుసు నంజినఁ గాని భూమిలో మిక్కిలి తీపు
తలపోయ నోటికి నితవు గానరాదు 4-106

18.
పెదవులచేటింతే పేదవాని కోపము 4-110

19.
వెన్నచేతఁ బట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీ వుండఁ గాను యెక్కడో చూచేను. 4-118

20.
ఆకాశము పొడవు ఆకాశమే యెరుఁగు
ఆకడ జలధిలోఁతు ఆ జలధే యెరుఁగు
నదుల యిసుకలెల్ల నదులే యెరుఁగును
కదిలి గాలి యిరవు గాలికే తెలుసు . 4-121 

యిరవగు జీవుల కెంత గలిగినా పర ధన కాంతలే బలు ప్రియము

16.
యిరవగు జీవుల కెంత గలిగినా
పర ధన కాంతలే బలు ప్రియము
నానా రుచులు యనంతము గలిగిన
కాని పదార్థమె కడుఁ దీపు
పానిన చదువుల పతన లుండఁగా
మానని దుర్భాష మాఁటలే హితవు. 4-96

Saturday, December 12, 2009

ఆస వొకటి యెంతయినాఁ దనియదు

15.
ఆస వొకటి యెంతయినాఁ దనియదు
వాసి యొకటి తన వంతులు మానదు
యీసొకటి శాంత మెరఁగని దిదె
మోసపు దేహికి ముక్తి యేదయ్యా
పాపమొకటి భవ బంధముఁ బాపదు
దీడన మొక్కటి ధీరత యొల్లదు
చూపొక టింద్రియ సుఖముల గెలువదు
యేపునఁ బ్రాణికి యెఱుకేదయ్యా
పాయ మొకటి చాపలములు మానదు
కాయ మొకటి తన కర్మము విడువదు 4-95

Friday, December 11, 2009

మిక్కిలిఁ జేసే పాపమే మీఁద నరకమై తోఁచు

14.
మిక్కిలిఁ జేసే పాపమే మీఁద నరకమై తోఁచు
నిక్కి తానే అద్వములో నీదై(డై) నట్లు
మహిఁ దొల్లి చూచి నూరే మదిలోనఁ దోఁచీని
గహనపు కాఁపురమే కల యై నట్లు
యెండ గాసే బయటనే యెక్కువ వెన్నెల గాసీ
దిండు రేయిఁ బగలొక్క దినమైనట్లు.  4-93

Wednesday, December 9, 2009

మహిలోన రోగములు మాన మందు గద్దు గాక

13.
మహిలోన రోగములు మాన మందు గద్దు గాక
సహజ గుణము మాన్పఁ జాలు మందు గలదా
తనరూప మద్దములో తగఁ జూడ వచ్చుఁ గాక
మనసు దా నద్దములో మరి చూడ వచ్చునా
నాలుకచే రుచులెల్ల నంజి చూడవచ్చుఁ గాక
జాలిఁ బడ్డ కన్నులచేఁ జవి గాన వచ్చునా  4-83

భూమ్మీద రోగాలను మాన్పేటందుకు మందులుంటాయి కాని మనిషి సహజ గుణాన్ని మార్చే మందులుండవు .
తన రూపాన్నైతే మనిషి అద్దంలో చూసుకోగలుగుతాడు కాని తన మనస్సును అందులో చూసుకోలేడుకదా . 
నాలుకతో రుచులను రుచి చూచి గ్రహించొచ్చు కాని కన్నులతో చూచి రుచిని గ్రహించటం సాధ్యం కాదు కదా.

Tuesday, December 8, 2009

పొల్లకట్టు దంచదంచఁ బోగులైనట్టు

12.
పొల్లకట్టు దంచదంచఁ బోగులైనట్టు
ముల్ల ముంటదీసి సుఖమున నుండినట్లు
చానిపిఁ జవి వేడితేఁ జప్పనైనట్టు
నూనె గొలిచి కుంచము నుసికిలినట్లు
తినఁ దిన వేమెల్లాఁ దీపైనట్టు
పనివడి చెఱుకునఁ బండు వండినట్లు . 4-80

Friday, December 4, 2009

కన్ను చూపుల సుఖము కడు నీ చక్కని రూపె

11.

కన్ను చూపుల సుఖము కడు నీ చక్కని రూపె
యెన్నఁగ వీనుల సుఖమిదె నీ పేరు
పన్ని నాలుక సుఖము పాదపు నీ తులసి
తనువుతోడి సుఖము తగు నీ కైంకర్యము
మనసులో సుఖము పాదపద్మము వాసన
పుట్టుగు కెల్ల సుఖము పొల్లు లేని నీ భక్తి
తొట్టికాళ్ళ సుఖము పాతురలాడుట.     4-78

Sunday, September 27, 2009

పన్నినఁ దొంతులపైఁ బడ నొక్క గుదియపెట్టువున్నతి మోఁదిన యట్టు

10.
పన్నినఁ దొంతులపైఁ బడ నొక్క గుదియపెట్టువున్నతి మోఁదిన యట్టు
చెంతఁ బంటెఁడు పాలలో నొక చల్లబొట్టు చేమిరివెట్టినట్టు
యిల నంధకారపు టింటిలో నొకదీప మెత్తి మెఱసినట్టు  4-77