౧౧. గుజ్జరి
కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు
చింతలేని యంబలొక్క చేరెడేఁ చాలు
తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు
ముట్టు లేని కూడొక్క ముద్దెఁడే చాలు 1-114
అతి చిన్న కొంపయినా కంతలు లేకుంటే అదే చాలు
ఏ చీకూ చింతా లేనప్పుడు అంబలి ఒక్క చేరెడైనా చాలు
తిట్లు తినకుండా బ్రతికే బ్రతుకొక్క దినమైనా అదే చాలు
పరిశుభ్రమైన కూడు ఒక్క ముద్దడైనా సరిపోతుంది.
శ్రీరాగం
కూడు వండుట గంజి కొరకా
కుప్ప నురుచుట కసవు కొరకా
కొలుచు దంచుట పొట్టు కొరకా
కొండ దవ్వుట యెలుక కొరకా 1-115
కూడు వండుకోవటం అన్నం తినడం కోసం-గంజి కోసం మాత్రం కాదు.
కుప్ప నూర్చటం ధాన్యం కోసం గాని గడ్డి కోసం మాత్రం కాదు.
వరి ధాన్యము దంచుట పిండి కోసం కాని పొట్టు కొరకు మాత్రం కాదు.
కొండదవ్వుట ఖనిజ సంపద కోసం కాని ఎలుకను పట్టుకోవడం కోసం కాదు.
Saturday, June 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment