Friday, September 5, 2008

సొమ్ము వో వేసినవాడు చుట్టి చుట్టి వీధులెల్లా

మలహరి
కంచూఁ గాదు పెంచూఁ(?) గాదు కడుఁ బెలుచు మనసు ౨-౨౧

శ్రీరాగం
ఊపిరిలో దేవుఁడున్నాడు యోగీంద్రులకు ౨-౨౩

రామక్రియ
అయ్యో వారి భాగ్య మంతే కాక
నెయ్యపు వెన్నవట్టుక నెయ్యి వెదకేరు ౨-౩౩

కన్నడగౌళ
సొమ్ము వోవేసినవాడు చుట్టి చుట్టి వీధు లెల్లా
కమ్ముక వెదకీనట కన్నదాఁకాను
వోడ బేరమాడేవాడు వొకదరి చేరిచి
కూడిన యర్థము గాచు కొనీనట
చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు(?) వేఁ గనడట
వూరకే శ్రీవేంకటేశ వేడుకతోడ. ౨-౩౯

No comments: