Thursday, December 17, 2009

యిరవగు జీవుల కెంత గలిగినా పర ధన కాంతలే బలు ప్రియము

16.
యిరవగు జీవుల కెంత గలిగినా
పర ధన కాంతలే బలు ప్రియము
నానా రుచులు యనంతము గలిగిన
కాని పదార్థమె కడుఁ దీపు
పానిన చదువుల పతన లుండఁగా
మానని దుర్భాష మాఁటలే హితవు. 4-96

3 comments:

Rami said...

దీని అర్థము ఎమి??

Rami said...

దీని అర్థము ఎమి??

Unknown said...

భూమి మీద నివసిస్తున్నప్రాణులకు ఎంత ధనమూ, మంచి భార్యా ఉన్నా కూడా పరులయొక్క ధనాన్ని భార్యనూ కోరుతుంటారనిన్నీ, అనంతమైన ఎన్నో మంచి మంచి రుచులున్నాకానీ ఆరోగ్యానికి పడని పదార్థమే ఎక్కువ తీపిగా అనిపిస్తుందనిన్నీ, మానవులను మంచిమార్గంలో నడిపే విద్యలు ఎన్నిఉన్నా కాని దుర్భాషలతో కూడిన మాటలే మనుష్యులకు హితవుగా అనిపిస్తాయనిన్నీ భావమనుకుంటున్నాను. పానిన అనే పదానికి అర్థం నిఘంటువులో కూడా దొరకలేదు. అలాగే పతన అనేదాలికీ అర్థం లభించలేదు.