Friday, February 27, 2009

ఆఱడిఁ బాము గరచినట్టివాఁడు దినఁబోతే

౪౩.
కన్నులు తెరచిన యప్పుడే కాన్పించున యీ లోకము
కన్నులు మూసినయప్పుడె కడగడ దా నణగు ౩-౩౫౭
౪౪.
ఆఱడిఁ బాము గరచినట్టివాఁడు దినఁబోతే
జాఱని వేఁప చేఁదైనాఁ జప్పనై తోఁచు
వీఱిడై సంసారపు విషమెక్కిన వానికి
చూఱలై హేయకాంతలు సుఖములై తోచును.౩-౩౬౭

౪౫.
వొగి నొడ్డె భాషలాడి వొడ్డెవాడనైతిని
తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగు వాడనైతి.౩-౩౭౯

No comments: