౧౪.సామంతం
చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టియాసలఁ బెట్టు వారే కాక
తగు బంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగల బెట్టుచుఁ దిరుగు వారే కాక
అంతహితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగు వారే కాక 1-179
కొడుకులు,భార్యలు,చెలికాండ్రు తనకు చుట్టములా-కాదు,వట్టి అశలు పెట్టేవారు మాత్రమే.
తల్లులు,తండ్రులు కూడా తనకు తగిన బంధువులు కారు-ప్రేమను ఒలకబోస్తో తిరిగే వారే కాని.
అన్నతమ్ములు కూడా తనకంత సన్నిహితులు కారు-వాటాల కోసం దెబ్బలాడే వారే కాని.
Sunday, June 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment