Sunday, June 8, 2008

మాలయింటి తోలుకప్పు మాయలు

౧౫.ముఖారి

మాలయింటి తోలుకప్పు మాయలు 1-189

దీని అర్ధం నాకు తెలియదు.ఎవరైనా తెలియపరిస్తే కృతజ్ఞుడను.
౧౬.బౌళి
వెలుగే చేను మేయగ జొచ్చె 1-193

చేనంతా వెలుగు పరచుకొన్నట్లు
౧౭.కన్నడగౌళ
పోయెఁ గాలం బడవికిఁ గాయు వెన్నెల కరణిని
బూరుగుమాఁకునఁ జెందిన కీరము చందమున 1-194

బూరుగు చెట్టున ఉన్న చిలుక లాగానూ, అడవిని కాసిన వెన్నెల లాగానూ కాలం వృధాగా గడిచి పోయింది.