Wednesday, July 9, 2008

కడు నడుసు చొరనేల కాళ్ళు గడుగఁగ నేల

२७.ముఖారి
కడు నడుసు చొరనేల కాళ్ళు గడుగఁగ నేల
కడలేని జన్మ సాగర మీదనేల -२५१

२८.కన్నడగౌళ
పుండు జీవులకెల్లఁ బుట్టక మానదు
పుండు మాన మందు వోయ గదయ్య -२५७
బురదలోనికి వెళ్ళడం ఎందుకు కాళ్ళు కడుగు కోవటం ఎందుకు।
కడ లేని సాగరము వంటి ఈ జన్మను ఈదటం ఎందుకు।(జన్మ రాహిత్యం కోరు కోవచ్చుగదా)

జీవు లైనవారి కందరికి శరీరం మీద ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక అక్కడైనా పుండు పుట్టక మానదు। పుండు మానాలంటే దానికి తగిన మందు వెయ్యాలి గదా.

No comments: