Wednesday, July 9, 2008

భారమైన వేఁపమాను పాలు వోసి పెంచినాను

దేవ గాంధారి
భారమైన వేఁపమాను పాలు వోసి పెంచినాను
తీరని చేఁదే కాక తియ్యనుండీనా

పాయ దీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయకెంత గట్టినాను చక్కనుండీనా

ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా

కూరిమితోఁ దేలుఁ దెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారెఁ గుట్టుగాక చక్కనుండీనా -२८७

బారమైన వేపచెట్టు కెంత పాలు పోసి పెంచినా చేదు చేదే కాని తియ్యగా మారదు।
అలానే కుక్కతోకను ఎంత పాయలుతీసి బిగదీసి కట్టినా గాని అది చక్కగా తయారు కాదు।
నీటిలో గొడ్డలిని ఒక మూలన ఎంతకాలము నానబెట్టినాగాని అది మెత్తబడదు.
అలాగే ప్రేమతో తేలును తెచ్చి కోకలో పెట్టుకుంటే అది మాటిమాటికి కుడుతుందే కాని చక్కగా వూరికే వుండదు గదా.

No comments: