Thursday, July 17, 2008

చెనకి మగఁడు విడిచిన మామ విడువని

రామక్రియ
౪౧.చెనకి మగఁడు విడిచిన మామ విడువని
పనియాయ ౧-౩౭౬

బౌళి
౪౨। యింటిలోని చీఁకటే యిట్టే తప్పక చూచితే
వెంటనే కొంతవడికి వెలుఁగిచ్చును
వొక్కొక్క యడుగే వొగి ముందర బెట్టితే
యెక్కువై కొండైనా నెక్కుఁ గొనకు ౧-౪౨౬

౪౩.సామంతం
కనురెప్ప మూసితే కడు సిష్టే చీఁకటౌను
కనురెప్పఁ దెరచితే క్రమ్మర బుట్టు। ౧-౪౩౪

౪౪।సామంతం
కంటినిదే యర్థము ఘన శాస్త్రములు దవ్వి
నంటున నిందుకంటెను నాణెమెందూ లేదు
పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారము కంటే బహు పుణ్యము లేదు
నిరత శాంతము కంటే నిజధర్మమెందు లేదు
హరి దాసుడౌకంటే నట గతి లేదు। ౧-౪౪౩

No comments: