Thursday, July 17, 2008

వడిఁ బారు పెనుమృగము వలలలోపలఁ దగులు

గుండక్రియ
౩౬.వడిఁ బారు పెనుమృగము వలలలోపలఁ దగులు
వడి వెడల గతిలేక వడఁకు చున్నట్లు
నీరులోపలిమీను నిగిడి యామిషముకై
కోరి గాలముమ్రింగి కూలఁబడినట్లు ౧-౩౩౧

ధన్నాసి
౩౭.సిరులు చంచలమని చేఁత లధ్రువమని
తొరలినసుఖమెల్ల దుఃఖమూలమని
తలకొన్నధర్మమే తలమీఁది మోఁపని
కలిమియు లేమియుఁ గడవఁగ రాదని
యేచిన పరహితమెంతయుఁ దమదని ౧-౩౩౯

౩౮.శ్రీరాగం
ముంత నీళ్ళనే మునిగేటి బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు ౧-౩౪౮

౪౦।పరుస మొక్కటే కాదా పయిడిగాఁ జేసేది। ౧-౩౭౩

No comments: