Wednesday, September 24, 2008

యెవ్వరు బుద్ధి చెప్పిరి యిలపైఁ జీమలకెల్లా

యెవ్వరు బుద్ధి చెప్పిరి యిలపైఁ జీమలకెల్లా
నెవ్వగఁ బుట్టలఁ గొల్చు నించుకొమ్మని
చెట్టుల కెవ్వరు బుద్ధి చెప్పేరు తతి కాలానఁ
బుట్టి కాచి పూచి నిండాఁ బొదలుమని
బుద్ధులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు
తిద్ది చన్నుఁ దాగి పూరిఁ దినుమని
౨-౪౫

ఎవరు ఈ భూమి మీద చీమలకు ఆపదలోనున్నపుడు పుట్టలలో ధాన్యమును నిండా నిలవచేసికొమ్మని బుద్ధి చెప్పారు?
ఎవరు చెట్లకు ఆ యా సరియైన కాలాల్లో పుట్టి, పూవులు పూచి, కాయలు కాచి, నిండుగా పెరగమని బుద్ధి చెప్పారు?
ఎవరు ఇక్కడ పుట్టిన నాలుగు కాళ్ళ జంతువులకు తిద్ది(?)చన్నుపాలు తాగి,గడ్డిని తినుమని బుద్ధులు చెప్పారు?

No comments: