Tuesday, October 7, 2008

తలపులు గడుగక వొడలటు తాఁ గడిగిన నేమి

శంకరాభరణం
తలపులు గడుగక వొడలటు తాఁ గడిగిన నేమి
వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
పొంచిన కోపము విడువక భోగము విడిచిన నేమి
పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
వేగమె లోపల గడుగక వెలి గడిగిన నేమి
యోగము దెలియక పలు చదువులు దెలిసిన నేమి ౨-౫౫
పై=శరీరము

No comments: