Tuesday, December 16, 2008

చీమకుఁ దనజన్మము చేరి సుఖమై తోఁచు

సామంతం
చీమకుఁ దనజన్మము చేరి సుఖమై తోఁచు
దోమకుఁ దనజన్మము దొడ్డ సుఖము
ఆమనియీఁగకు సుఖ మాజన్మమై తోఁచు
యేమిటా నెక్కువసుఖ మెవ్వరికేదయ్యా.

జంతురాసులకునెల్లా జననము లొక్కటే
అంతటాను మరణము లవియొక్కటే
చెంత నాహారనిద్రలు స్త్రీసుఖాలొక్కటే
ఇంతటా నిందుకంటే నెవ్వ రేమి గట్టిరయ్యా.౨-౪౦౯

No comments: