Sunday, December 14, 2008

కోపగించి చంకబిడ్డఁ గోరి తల్లి డించితేను

రామక్రియ
కోపగించి చంకబిడ్డఁ గోరి తల్లి డించితేను
పై పై నే పడుఁగాక పాసిపొయ్యీనా
వోపక నా నేరముల కొగి నీవు వేసరితే
నీపాదాలే గతిగాక నే మానేనా.

చదివించే అయఁగారు జంకించి చూచితేను
వొదిగి చదువుఁగాక వోపననీనా
యెదుటిగుణములకు నెంత నీవు దొబ్బినాను
యిదె నీకే మొక్కుదుఁగా కింక మానేనా.

చెక్కు మీటి పెంచినదాది వోయఁగాను
గక్కున మింగుటగాక కాదనీనా.౨-౪౦౦

No comments: