Sunday, December 28, 2008

పుచ్చినట్టి పండు బూఁజి లోననే వుండు

రామక్రియ
పుచ్చినట్టి పండు బూఁజి లోననే వుండు
బచ్చన కవితలు బాఁతి గావు యెందు

వుల్లిదిన్న కోమటూరక వున్నట్టు
జల్లెడ నావాలు జారిపోయినట్టు

నేతిబీరకాయ నేయి అందు లేదు
రాతివీరునికి బీరము ఇంచుకా లేదు.౨-౪౯౪

No comments: