దేసాళం
7.
తక్కిన చదువు లొల్ల తప్పనొల్లా
చక్కఁగ శ్రీహరి నీ శరణే చాలు. IIపల్లవిII
మోపులు మోవఁగ నొల్ల ములుగఁగ నొల్ల
తీపు నంజనొల్ల చేఁదు దినఁగ నొల్ల
పాప పుణ్యాలవి యొల్ల భవమునఁ బుట్టనొల్ల
శ్రీపతినే నిరతము చింతించుటే చాలు. IIతక్కినII
వడిగాఁ బరువు లొల్ల వగరింప నే నొల్ల
వెడఁగుఁ జీకటి యొల్ల వెలుగూ నొల్ల
యిడుముల వేఁడనొల్ల యెక్కువ భోగము లొల్ల
తడయక హరి నీ దాస్యమే చాలు. IIతక్కినII
అట్టె పథ్యము లొల్ల అవుషధము గొన నొల్ల
మట్టులేని మణుఁగొల్ల మైలగా నొల్ల
యిట్టె శ్రీవేంకటేశు నిరవుగ సేవించి
చుట్టుకొన్న యానంద సుఖమే చాలు. IIతక్కినII 4-65
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment