9. పాడి
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు. IIపల్లవిII
కను దెరచినంతనే కలుగు నీ జగము
కనుమూసినంతనే కడు శూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోఁచీని. IIతొల్లిII
తలఁచినంతనె యెంత దవ్వయిన గాన్పించు
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలుచంచలవికారభావ మీ గుణము. IIతొల్లిII
ముందు దాఁ గలిగితే మూఁడు లోకములుఁ గల
వెందు దా లేకుంటే నేమియును లేదు
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఈ పాట మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పాడినది విన్నాను. చెవుల్లో రింగుఋ మంటోంది ఆ పాట
ఈ పాట మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పాడినది విన్నాను. చెవుల్లో inka రింగు మంటోందిఆపాట
EE paata artham evaranna vivarina naaku chaala santhosham
Post a Comment