Sunday, July 18, 2010

ముఖరమై మాఁకులకు మొదలఁ బోసిన నీరు శిఖలకుఁ దనువెక్కి చిగిరించిన యట్టు

29.
ముఖరమై మాఁకులకు మొదలఁ బోసిన నీరు
శిఖలకుఁ దనువెక్కి చిగిరించిన యట్టు
వరుసల నిన్నిటా వన్నె బంగారమే
పరిపరి విధముల పలు సొమ్ములైనట్లు 4-340

30.
ఎంత వెఱ్ఱిఁ గొండదవ్వి యెలుకఁ బట్టెద నేను
పంతపు శ్రీహరి నా భ్రమ వాపవే
పడని పాట్లఁ బెక్కు పనులఁ దిరుగుటెల్ల
కుడిచే పట్టెఁడు గూటి కొర కింతే కా
కడ దాఁకాఁ జెలులతోఁ కాపురము సేయుటెల్ల
వొడలు మరచి యుండే వొక్క నిమిషానికా. 4-344

3 comments:

Telugu Cartoon said...
This comment has been removed by the author.
Telugu Cartoon said...

నరసింహ గారు,
వందనములు. మాటలలో చెప్పలేని అనుభూతి కలిగింది మీ బ్లాగ్ చూశాక.
తెలుగు భాషని అభిమానిచేవారికి మీ బ్లాగ్ ఓ గొప్ప వరం.

Unknown said...

ధన్యవాదములు. ఈ బ్లాగు మొదలుపెట్టిన తర్వాత వచ్చిన మొదటి కామెంటనుకుంటాను మీది.