బౌళి
౭.ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయెఁ గాలము
యెదురు చూచి చూచి యెలయించి యెలయించి
పొద చాటు మృగమై పోయఁ గాలము
చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని-
పొంత నున్న వెన్నయై పోయఁ గాలము 1-48
మంచి జ్ఞానము ఎక్కడ?నాకు తెలివి యెక్కడ? కాలమంతా బూడిదలో చేసిన హోమం వలె అయ్యింది.ఆసక్తితో, ఆశతో యెదురు చూచి చూచి పొద చాటున దాగిన జింక వలె ఐనది కాలమంతా.వగపు,వేదనల మధ్య చిక్కుపడి నిప్పు దగ్గరగా వున్న వెన్నలా కరిగిపోయింగి కాలమంతా.
శ్రీరాగం
౮.కుమ్మరికి నొక యేఁడు గుదియ కొక నాఁడవును
పొదరి గొరియల లోన పులి చొచ్చి నట్లౌను
బెరసి కొండల మీదఁ బిడుగు వడ్డట్టౌను 1-64
భూపాళం
౯. ఎద్దేమెఱుఁగు నడుకుల చవి 1-87
ఎద్దుకు అటుకుల రుచి తెలియనట్లు
౧0.ఆహిరి
కుక్కనోరి కళాసమై కొల్లఁ బోయ బతుకు
వండఁ దరిగిన కూరవలె నాయ బతుకు
దంచనున్న రోలిపిండి తలఁ పాయె బతుకు
బీదగరచిన బూరె ప్రియమాయ బ్రదుకు 1-90
కుక్క నోటిలోని తోలుముక్క మాదిరి దోపిడి అయింది బతుకు. వంట చేయటానికి తరిగి పెట్టిన కూర మాదిరి అయింది బతుకు.
రోట్లో వేసి దంచనున్న రోలిపిండి లా నయింది బతుకు.బీదవాడు నోట కరచిన బూరెలా ప్రియమైనది బతుకు.
Monday, June 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
నరశింహ గారికి
మీ ప్రయత్నం అద్భుతం.
అన్నమయ్య అచ్చతెలుగులోనే వ్రాసినా, నాబోటివాండ్లకు కొన్ని పదాలకర్ధాలు గ్రాహ్యదూరంగానే ఉంటున్నాయి. ఇది ముమ్మాటికీ నా అజ్ఞానమె.
కనుక వీలువెంబడి ఒక్కొక్క జాతీయానికి కొద్దిపాటి వ్యాఖ్య నుకూడా ఇచ్చినట్లయితే్ బాగుంటుంది. మీద్వారా అన్నమయ్య భావాలను అందుకోవాలని ఆశిస్తున్నాను.
బొల్లోజు బాబా
నరశింహ గారికి,
మీ సైటు ఇప్పుడే దర్శించాను. చక్కటి జాతియాలను పోస్ట్ చేసారు.అన్నమయ్య పలుకుబళ్ళు, భాష లో మార్పులవల్ల చాలావరకు ఇప్పటి వారికి అర్థం కానివిగా ఉంటున్నయి. TTD వారు అన్నమయ్య పలుకుబళ్ళు ని పుస్తకరూపం లో ప్రచురించారు.
మీరు వ్రాసిన జాతీయాలకు వివరణ కూడ ఇవ్వండి.
with best wishes
D.Subrahmanyam
బాబా గారికి,సుబ్రహ్మణ్యం గారికి నెనరులు.మీరిద్దరి సలహా పై వివరణలను "నా నేర్చిన భంగి" వ్రాద్దామని ప్రయత్నిస్తున్నాను.కాని నా వంటి వానికి ఇది సాధ్యమేనా అని సందేహం కలుగుతోంది.నా చేత ఈ సాహసం అన్నమయ్యే శ్రీ వేంకటేశ్వరుని కృపతో చేయిస్తున్నారని తలుస్తాను.
very interesting effort.
Are these lines extracted from Annamayya padamulu?
What do numbers like 1-64, 1-48 mean?
thank you
కొత్త పాళీ గారికి
నా బ్లాగు పై మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
నేను ఎత్తి వ్రాసేవి టి.టి.డి.వారు ప్రచురించిన "తాళ్ళపాక పదసాహిత్యము" సంపుటములనుండి.1-48 అంటే 1వ సంపుటం 48వ సంకీర్తవ అని.ఇవి మొత్తం 29 సంవుటములు.వీటిని కలిగి వుండటం నా భాగ్యం గా భావిస్తాను.
కొత్త పాళీ గారికి
నా యితర బ్లాగులపై(భారతీయం http://www.kasstuuritilakam.blogspot.com/మరియు నరసింహhttp://www.kastuuritilakam.blogspot.com/లపై కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయ ప్రార్ధన.
Post a Comment