౧౯।శ్రీరాగం
వెన్న వట్టుక నేయి వెదకనేలా 1-202
వెన్న చేతిలో వుండగా నేయి కోసం వెదకే పని లేదు.
౨౦. దేసాక్షి
తాడిమానెక్కేటివాని తడయక పట్టి పట్టి
తోడఁ దోడ నెందాకాఁ దోయవచ్చును
మన్నుఁదినియేటి దూడ మానుమంటా మొత్తి మొత్తి
కన్నిగట్టి యెందాకఁ గాయవచ్చును
హేయముఁ దొక్కకుమన్న యేచి తినేననేవాఁడు
తాయకు రాకున్న నేమి సేయవచ్చును. 1-208
తాడి చెట్టెక్కే వాణ్ణి ఆలస్యంకాకుండగా పట్టి పటియెంత