నాట
౨౧.తొలుకారు మెఱుపులు తోఁ చి పోవుగాక
నెలకొని మింటనవి నిలిచీనా
పొలతుల వలపులు పొలసి పోవుగాక
కలకాలంబవి కడతేరీనా
యెండమావులు చూడ నేరులై పారుఁ గాక
అండకుబోవ దాహ మణగీనా
నిండినట్టి మోహము నెలతల మదిఁ జూడ
వుండినట్టే వుండుగాక వూతయ్యీనా
కలలోని సిరులెల్ల కనుకూర్కులేగాక
మెలకువఁ జూడనవి మెరసీనా 1-220
తొలకరి మెఱుపులు కనిపించి మాయమౌతాయి కానీ ఆకాశంమీద నిలచి అలాగే వుండిపోవు గదా.
అలాగే వనితల వలపులు పురుషులలో ప్రవేశించి వెళ్ళిపోతాయి కానీ కలకాలం అవి కడతేరేనా.
యెండమావుల్ని చూస్తుంటే నీళ్ళు ఏరులై పారుతున్నట్లుగా కనిపిస్తాయి కానీ దగ్గరకు పోతే దాహం తీరుతుందా.
స్త్రీల మనసుల్లో నిండుగా ఉన్నట్లున్న మోహము అక్కడ వుండినట్టే వుంటుంది కానీ అది ఆధారపడతగినది కాదు.
కలలో కలగన్న ధనరాసులు కల్లలే కానీ మెలకువలోకొచ్చాక చూస్తే అవి మన కళ్ళ యెదుట మెరుస్తూ వుంటాయా.