Sunday, June 8, 2008

గడ్డపార మింగితే నాఁకలి తీరేనా

౧౩.కాంబోది
గడ్డపార మింగితే నాఁకలి తీరేనా(?)
వొడ్డిన భవముఁ దన్ను వొడకమ్ము గాక
చించుక మిన్నులఁ బారే చింకలను బండిఁగట్టి
వంచుకొనేమన్న నవి వశమయ్యినా
మంటమండే యగ్గిఁ దెచ్చి మసిపాత మూఁటగట్టి
యింటిలోన దాచుకొన్న నితవయ్యీనా
పట్టరాని విషముల పాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకున్నా నది మందపిలి వుండీనా 1-177



గడ్డపార మింగితే ఆకలి తీరుతుందా
వొడ్డిన భవము దన్ను వొడకమ్ము గాక(?)
ఆకాశములో ఎగిరే చిలుకలను పట్టి బండిగట్టి వశములో ఉంచుకొనాలంటే సాధ్యమయ్యేనా?
మండుతున్న నిప్పు తెచ్చి మసి గుడ్డలో మూటగట్టి ఇంటిలో దాచుకొందామంటే వీలయ్యేనా?
తాచు పాము తెచ్చి తలకింద పెట్టుకుంటే అది అణగి అలాగే వుంటుందా?

2 comments:

Bolloju Baba said...

చాలా బాగున్నాయి. మీ వివరణలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బొల్లోజు బాబా

Unknown said...

బాబా గారికి నెనరులు.