గుండక్రియ
కడుపెంత తాఁ గుడుచు కుడుపెంత దీనికై
పడని పాట్ల నెల్లఁ బడి పొరలనేలా
పరుల మనసునకు నాపదలు కలుగఁగఁ జేయఁ
బరితాపకరమైన బ్రదుకేలా
సొరిది నితరుల మేలు చూచి సైఁపగ లేక
తిరుగు చుండేటి కష్ట దేహమిదియేలా
యెదిరికెప్పుడుఁ జేయు హితమెల్లఁ దనదనుచు
చదువు చెప్పనియట్టి చదువేలా
పొదిగొన్న యాసలోఁ బుంగుడై సతతంబు
సదమదంబై పడయు చవులుఁ దనకేలా १-३०२
కడుపునకు తినడానికి ఎంత కావాలి దీనికోసమై ఎంత బాధ పడాలి
ఇతరుల మనసునకు ఆపదలు కలుగ చేయు పరితాపకరమైన బ్రతుకెందులకు
ఇతరుల మేలు చూచి ఓర్వలేక తిరుగుచుండేటి పాపిష్టి దేహమిది యెందులకు
ఎదుటివారికి ఎప్పుడూ చేసే హితమైన కార్యమెల్లా తనదే అనుకోనట్టి చదువు చెప్పనటువంటి చదువేలా
గుంపుగూడిన ఆశలలో ఎల్లప్పుడూ మునిగిపోయి సదమదమై పడసే నాలుగు డబ్బులు తనకేలా.
Wednesday, July 9, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment