Tuesday, November 4, 2008

కంటికిఁ గంటిరెప్ప కాచుకవుండినయట్టు

దేసాక్షి
కంటికిఁ గంటిరెప్ప కాచుకవుండిన యట్టు
వొంటి దేహమెల్లాఁ జేవొడ్డు కొన్నట్టు
అంటుక దేహి నేపొద్దు అంతరాత్మయైవుండీ
జంటయై కాచుకున్నాఁడు సర్వేశుఁడే సుండీ.

చీకటి నోటికి గడి చేయే కొంటవచ్చినట్టు
ఆఁకటికి గుక్కిళ్ళు ఆసయినట్టు
వీఁకల జంతువులకు వెలుపల లోన నుండి
సాఁకుచున్నాఁడిదివో సర్వేశుఁడే సుండీ. ౨-౯౬

No comments: