Thursday, November 6, 2008

పై పై నెదురుకట్లఁ బంచదార వుండఁగాను

దేసాళం
పై పై నెదురుకట్లఁ బంచదార వుండఁగాను
చేపట్టి యడిగి తెచ్చి చేఁదు దిన్నట్లు
యింటిలోనే నవరత్నా లెన్నియైనా నుండఁగాను
కంటగించి గాజుఁ బూస గట్టుకొన్నట్లు
చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండఁగాను
వేసరక వెలయాలి వెతకినట్లు ౨-౧౦౩


మన దగ్గరనే ఉన్నవి మనకు పనికిరావు.దూరపుకొండలెప్పుడూ నున్నగానే కనిపిస్తాయి.

No comments: