Sunday, November 9, 2008

పూవులపై గాసీ పొరిముండ్లపైఁ గాసీని

శంకరాభరణం
పూవులపై గాసీ పొరిముండ్లపైఁ గాసీని
ఆవల వెన్నెల కేమి హాని వచ్చీనా

గోవుమీఁద విసరీఁ గుక్కమీఁద విసరీని
పావనపు గాలికి పాపమంటీనా

కులజుని యింట నుండీ కులహీనుని యింట నుండీ
యిలలో నెండకు నేమి హీనమయ్యీనా. ౨-౧౦౩

వెన్నెల,గాలి,యెండా,ఉదాహరణ గా తీసుకుని అన్నమయ్య సమభావనని అందరిలో పాదుకొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు.

No comments: