Sunday, December 7, 2008

తింటేనే విషమెక్కు దిష్టముగ విషలత

గుజ్జరి
త్రికరణశుద్ధిగఁ జేసినపనులకు దేవుఁడు మెచ్చును లోకము మెచ్చును ౨-౨౩౬.

ముఖారి
పాలించే మగఁడు గలపడతి కేడ చింత
కలిమి గలవానికి కడమ లేదు
కుట్టిచాతనివారికిఁ గొంకు లేదు. ౨-౨౩౭.


కుట్టిచాతనివారు=?

గుండక్రియ
తింటేనే విషమెక్కు దిష్టముగ విషలత
కంటేనే వలపెక్కుఁ గాంతలను
అంటిముట్టి కాఁగిట నలముకొంటేఁ గనక
మంట గలసిన భ్రమ మానలేదు
మెట్టితేనే కఱచును మెలుపు తోడుతఁ బాము
పట్టితే విడువనీదు పచ్చని పైడి
దట్టమై మేన సొమ్ములు తగులుకొంటేగనక
తొట్టివెల్లిఁ బోయినాస తొలఁగ నీదు. ౨-౨౩౮.

No comments: