ధన్నాసి
హరిఁ గొలువని కొలువులు మఱి యడవిఁ గాసిన వెన్నెలలు
గరిమల నచ్యుతు వినని కథలు భువి గజస్నానములు
పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళముల నిధానములు
మరు గురునికిఁ గాని పూవుల పూజలు మగడు లేని సింగారములు
వైకుంఠుని నుతియించని నుతులు వననిధిఁ గురిసిన వానలు
ఆ కమలోదరుఁ గోరని కోరికె లందని మాని ఫలంబులు
శ్రీకాంతునిపైఁ జేయని భక్తులు చెంబు మీఁది కనకఁపుఁ బూత
దాకొని విష్ణుని తెలియని తెలువులు తగ నేటినడిమి పైరులు
వావిరిఁ గేశవు నొల్లని బదుకులు వరతఁ గలపు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడ లేని పెను చిత్రములు
భావించి మాధవుపై లేని తలఁపులు పలు మేఘముల వికారములు
శ్రీవేంకటపతి కరుణ గలిగితే జీవులకివియే వినోదములు. ౨-౨౩౫
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment