Tuesday, December 9, 2008

ధరణి నెందరెన్ని తపములుఁ చేసినాను

దేసాళం
ధరణి నెందరెన్ని తపములుఁ చేసినాను
హరి కృప గలవాఁడే అన్నిఁటాఁ బూజ్యుడు. IIపల్లవిII

మితిలేని విత్తులెన్ని మేదినిపైఁ జల్లినాను
తతితో విత్తినవే తగఁ బండును
యితర కాంతలు మరి యెందరుఁ గలిగినాను
పతి మన్నించినదే పట్టపుదేవులు. IIధరII

పాలుపడి నరులెన్ని పాట్లఁ బడి కొలిచినా-
నేలిక చేపట్టినవాఁడే యెక్కుడు బంటు
మూలనెంత ధనమున్నా ముంచి దానధర్మములు
తాలిమితో నిచ్చినదేఁ దాపురమై నిల్చును. IIధరII

యెన్నికకుఁ గొడుకులు యెందరుఁ గలిగినాను
యిన్నిటా ధర్మపరుడే యీడేరును
వున్నతిఁ జదువులెన్ని వుండినా శ్రీవేంకటేశు
సన్నుతించిన మంత్రమే సతమై ఫలించును. IIధరII

No comments: