Monday, December 8, 2008

మలమూత్రంబుల మాంసపు ముద్దకు

శ్రీరాగం
మలమూత్రంబుల మాంసపు ముద్దకు
కులగోత్రంబుల గుఱిఁ గలిగె
తొలులు తొమ్మిదగు తోలుఁ దిత్తికిని
పిలువగఁ బేరునుఁ బెంపునుఁ గలిగె.

నెత్తురు నెమ్ముల నీరుబుగ్గకును
హత్తిన కర్మము లటుఁ గలిగె
కొత్త వెంట్రుకల గుబురుల గంతికి
పొత్తుల సంసార భోగముఁ గలిగె.

నానా ముఖముల నరముల పిడుచకు
పూనిన సిగ్గులు భువిఁ గలిగె
ఆనుక శ్రీవేంకటాద్రిపుఁ డేలగ
దీనికిఁ బ్రాణము తిరముగఁ గలిగె.
౨-౨౫౧

No comments: