Wednesday, December 10, 2008

సతులతో నవ్వులు చందమామ గుటుకలు

ముఖారి
సతులతో నవ్వులు చందమామ గుటుకలు
మతి తలపోత లెండమావులనీళ్ళు
రతులలో మాటలు రావిమానిపువ్వులు
తతి విరహఁపు కాఁక తాటిమానినీడ.

లలనలజవ్వనాలు లక్కపూసక పురులు
నెలకొని సేసేబత్తి నీటిపై వ్రాత
చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు
కొలఁదిలేని ననుపు గోడ మీఁది సున్నము.

పడతుల వేడుకలు పచ్చి వడఁగండ్ల గుళ్ళు
కడుమోవి తీపు చింతకాయకజ్జము.
౨-౨౬౮

No comments: