శ్రీరాగం
మరుని తండ్రికిని మఱి చక్కదనమెంత
సిరిమగని భాగ్యము చెప్పనెంత
పురుషోత్తము ఘనత పొగడఁగ నిఁక నెంత
గరిమ జలధిసాయి గంభీరమెంత.
వేవేలు ముఖాలవాని విగ్రహము చెప్పనెంత
భూవల్లభుని వోరుపు పోలించనెంత
వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింప రాజసమెంత
యేవల్లఁ జక్రాయుధుని కెదురెంచనెంత.
అమిత వరదునికి ఔదార్య గుణమెంత
విమతాసురవైరి విక్రమమెంత
మమతల నలమేలుమంగపతి సొబగెంత
అమరశ్రీవేంకటేశుఁ ఆధిక్యమెంత.౨-౨౭౯
Thursday, December 11, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment