Sunday, December 14, 2008

బట్టబయటఁ దోలితేను బందె మేయుఁ బసురము

శుద్ధవసంతం
బట్టబయటఁ దోలితేను బందె మేయుఁ బసురము
పట్టి మేపితేను తన పనులుచేయు

బడి దప్పితే బంట్లు పరదేసులౌదురు
యెడయక కూడుకొంటే హితులౌదురు

చేవదలితే పెంచిన చిలుకైనా మేడలెక్కు
రావించి గుంటఁ బెట్టితే రామా యనును.౨-౩౪౧

No comments: