Friday, December 5, 2008

మాలతనము వంటిది మతిఁ దగులుఁ గామము

సామంతం
మాలతనము వంటిది మతిఁ దగులుఁ గామము
అలరి ముట్టు వంటిది అంటుఁ గ్రోధము
కేలి నొదిగించు నెంగిలి వంటిది లోభము
చుట్టి మద్యము వంటిది చొక్కించు మోహము
వట్టి మాంసము వంటిది వయోమదము
పుట్టిన భ్రమ వంటిది పొదిగిన మచ్చరము
గోడ మఱగు వంటిది గుట్టుతోడి సంసారము
వీడని కట్టు వంటిది వేడుక యాస. ౨-౨౧౧

No comments: