Friday, January 9, 2009

మదించిన యేనుగను మావటీఁడు దిద్దినట్టు

18.
సావి వోదెన్నడు సంసారము
చాపకింది నీరు సంసారము
౩-౧౦౫

19.
మదించిన యేనుగను మావటీఁడు దిద్దినట్టు
త్రిదశ వంద్యుడ నీవే తిప్పఁగదే మనసు

నేరమి సేసినవాఁడు నిక్కపు టేలికఁ గని
తారి తారి యిందు నందు దాఁగిన యట్టు

పగ సేసుకొన్న వాఁడు బలు మందసములోన
వెగటు జాగరముల వేగించినట్టు

నిరుఁబేద యైనవాఁడు నిధానము పొడగని
గరిమ భ్రమసి యట్టె కాచుకున్నట్టు.౩-౧౦౭

No comments: