Wednesday, January 7, 2009

పేరడిఁ దల్లిదండ్రులు బిడ్డలేమి సేసినాను

17.పేరడిఁ దల్లిదండ్రులు బిడ్డలేమి సేసినాను
వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున.

భావించుక యింటిదొర పసురము దెంచుకొని
యేవిధిఁ బైరుమేసినా నెగ్గుసేయఁ డతడు.

వొట్టుక శ్రీవేంకటేశ వోడఁగట్టిన దూలము
అటునిట్టుఁ బొరలినా నండవాయదెపుడు.
౩-౯౭

No comments: