౨౨.
కనకము కనకమే కడు నినుమినుమే ౩-౧౧౧
౨౩.
వొక చేత హేయ ముడుగక కడుగును
వొక చేత భుజించు నొగి రుచులు ౩-౧౨౦
౨౪.
ధరలో యాచకునకు ధర్మాధర్మము లేదు
సిరులఁ గాముకినికి సిగ్గు లేదు
పరమ పాతకునకు భయ మించుకా లేదు
మించిన కృతఘ్నునికి మే లెన్నఁడును లేదు
చంచల చిత్తునకు నిశ్చయమే లేదు
అంచల నాస్తికునకు నాచారమే లేదు
మదించిన సంసారికి మరి తనివే లేదు
పొదిగొన మూర్ఖునకు బుద్ధే లేదు ౩-౧౨౧
Monday, January 26, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment