Sunday, February 1, 2009

ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు

౨౬.
జాతి చండాలము దీరు జన్మాంతరములను
యేతులఁ గర్మచండాలమెన్నడూఁ బోదు.౩-౧౩౦

౨౭.
ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి.౩-౧౬౦

౨౮.
తల్లికి లేని ముద్దు దాదికిఁ గలదా మరి.౩-౧౬౭

౨౯.
తీపని మీసాలమీఁది తేనె నాకుట సుండీ
రీతి నడవి గాసిన రిత్త వెన్నెలఁ సుండీ.౩-౧౬౯

No comments: