౨౩.
కోక చాకియింట వేసి కొక్కెరాలవెంటఁ బోతే
ఆకడ పురుషార్థము నందీనా జీవుడు. ౩-౧౭౫
౨౪.
తోలు నెముకలు ముట్టి దోసమంటాఁ దీర్థమాడి
తోలునెముకల మేనితోడ నున్నాఁడ
బూతునఁ బుట్టినందుకు పుణ్యములెల్లాఁ జేసి
బూతుల సంసారమే భోగించేము
కర్మములన్నియుఁ దోసి ఘనముక్తిఁ బొందేనంటా
కర్మాచరణములే కడుఁ జేసేము.౩-౧౭౭
Tuesday, February 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment