Thursday, February 5, 2009

కలిమి గలిగియు నధమగతి యదేల

౨౫.
కలిమి గలిగియు నధమగతి యదేల
బలిమి గలిగియు లోఁగి బతిమాలనేల
మెలిగి సూర్యుఁ డొక్కఁడు మిక్కిలిని వెలుఁగగా
వెలలేని దీపములు వేయి నేమిటికి
సిరులఁ జింతామణటు చేతిలో నుండఁగా
సరి గాజుఁబూస మెచ్చఁగ నదేమిటికి
నాలుకను మంచి హరినామ మొక టుండగా
గాలిఁ బోయేటి వూరగాథలేల.-187

No comments: