౨౭.
మగఁడు విడిచినా మామ విడువని యట్లు
పొసఁగ దేవుడిచ్చినా పూజరి వరమీడు
నుడుగులు దప్పినా నోము ఫల మిచ్చినట్టు. ౩-౨౨౦
౨౮.
అరసి పెద్దల నన్నీ నడుగుచుండంగ వలె. ౩-౨౨౮
౨౯.
తొడుకు మేయఁగ రాదు తూర్పెత్తితేఁ బొల్లు వోదు
వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్తి గాదు
కొలచి శ్రీహరి భక్తి కుప్ప చేసితే
యెలుకకుఁ దినరాదు యెన్నాళ్ళున్నా జివుకదు
తలఁచి హరిభక్తి చిత్తపుగాదెఁ బెట్టితే
కఱవుకుఁ లోగాదు సుంకరవాని కబ్బదు
యెఱుకతో హరిభక్తి యిల్లు నిండితే. ౩-౨౩౦
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment