Thursday, February 12, 2009

విని కందరి కొక్కటే వివరములే వేరు

౩౦.
విని కందరి కొక్కటే వివరములే వేరు
కనుచూపులు నొక్కటే కాంక్షలే వేరు
మనసూ నొక్కటే లోని మర్మములే వేరు
తనివియు నొక్కటే తనువులే వేరు.

లోకమును నోక్కటే లోను వెలుపల వేరు
వాకు లొక్కటే భాషల వరుసే వేరు
జోక నాహారమొకటే సొరిది రుచులే వేరు
కైకొన్న రతి యొకటే కందువలే వేరు.

పరిమళ మొక్కటే భాగించుకొనుటే వేరు
యిరవైన దొక్కటే యింపులే వేరు
అరిది శ్రీవేంకటేశ అన్నిటా నీ దాసుల
శరణాగతి యొక్కటే జాతులే వేరు. ౩-౨౩౮

No comments: