Saturday, February 14, 2009

చిచ్చు గాఁగిలించుకొంటే చిమిడించకుండునా

౩౧.
గుట్టు తెలియ ప్రాణము కూటి చేతిది
చేరి చెట్టడిచితేను చేటఁడు చుట్టరికాలు ౩-౨౪౮
౩౨.
చిచ్చు గాఁగిలించుకొంటే చిమిడించకుండునా
గచ్చుఁ బరస్త్రీలపొందు కాఁకుండునా
తచ్చి విషము మింగితే తలకెక్కకుండునా
పచ్చి సతులవలపు భ్రమయించ కుండునా

తెగి సముద్రము చొచ్చితే లోఁబడకుండునా
మొగి నింతులమాటలు ముంచకుండునా. ౩-౨౭౩

No comments: