Friday, February 20, 2009

కులమెంత గలిగె నది కూడించు గర్వంబు

౩౫.
కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమే రేచు
తలఁపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
ధనమెంత గలిగెనది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పుఁ బైపై మదము
తరుణులెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు. ౩-౩౨౨

No comments: