Monday, February 23, 2009

కొన్ని జంతువులు రోసిన హేయము కొన్ని జంతువుల కమృతము

౩౬.
నాలో నున్నాఁ డవు నన్నుఁ గావ(క) నీకుఁ బోదు
యీ లీలఁ బట్టు చీరె రవిచ్చిన వానివలె ౩-౩౩౮

౩౭.
రెప్పల తుద నివిగో రేపులు మాపులును -౩౪౧

౩౮.
వెఱ్ఱి దెలిసి జగము వెస రోఁకలి చుట్టెను. -౩౪౩.
౩౯.
వింతలై యడవిఁ గాసే వెన్నెలాయ బ్రదుకు -౩౪౪.
౩౮.
కొన్ని జంతువులు రోసిన హేయము కొన్ని జంతువుల కమృతము
కొన్ని జంతువుల దివములే రాత్రులు కొన్ని జంతువులకు
కొందరు విడిచిన సంసారము మరి కొందరికి నది భోగ్యము
కొందరి వునుకులు వూర్థ్వలోకములు కొందరి వునుకులు పాతాళంబు
కొంతభూమి నటు చీఁకటి నిండినఁ గొంత భూమి వెన్నెల గాయు
కొంతట సురలును కొంతట నసురులు కోరికై కొనిరి జగమెల్లా.౩-౩౪౬.

No comments: