Friday, March 20, 2009

దేహముపై రోత తెలుసు కొనేటి వేళ

౪౮.
దేహముపై రోత తెలుసు కొనేటి వేళ
ఆహా యిదే హేయమై తోఁచును
మోహించి విషయాల మునిఁగిన వేళనిదె
యీహల నంతటిలోనే ఇతవులై వుండును.

చదివి నే పురాణాలు సారెకు వినేటి వేళ
అదివో విరతి ఘనమై వుండును
కదిసి సంసారసుఖకాంక్షలఁ బొందేటి వేళ
మది నన్నిటు మరచి మదమెక్కి వుండును. -౩౯౮

No comments: