౪౯.
మన్నునఁ బుట్టిన కాయము మన్నున నణగేటిదింతే
మిన్నుల మీఁదికిఁ బోవదు మెరయుచు నెంతైనా
ధరపైఁ బుట్టిన దేహము ధరపై గిట్టున దింతే
పరమానందము గోరదు పైపై నెంతయినా.౩-౪౦౪
౫౦.
కలవి రెండే భూమి కామనిధానంబులు
జలజాక్షుడు నతని శరణాగతియు.౩-౪౧౨
౫౧.
వున్నతి దీపము వట్టి వొగి నూతఁ బడనేల
కాలము నేరు గుడిచి కాలువ వొగడ నేల.౩-౪౧౩
Sunday, March 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment