Thursday, April 2, 2009

వొరుల వేఁడకవుంటే వున్నచోటే సుఖము

౫౨.
వొరుల వేఁడకవుంటే వున్నచోటే సుఖము
పరనింద విడిచితే భావమెల్లా సుఖము
సరవిఁ గోపించకుంటే జన్మ మెల్లా సుఖమే
హరిఁ గొలిచినవారి కన్నిటాను సుఖమే.

కానిపని సేయకుంటే కాయమే సుఖము
మౌనమున నుండితేను మరులైనా సుఖము
దీనత విడిచితేను దినములెల్లా సుఖము
అని హరిఁ దలచితే నంతటా సుఖమే.౩-౪౧౪.

No comments: